పవన్ పై ప్రేమతో నాగబాబు ఏం చేశాడో తెలుసా?

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఉన్న ప్రేమను ప్రత్యర్థులపై పగగా చూపించాడు ఆయన సోదరుడు నాగబాబు. ఇటీవల నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేశాడు. తాజాగా పవన్ కళ్యాన్ పోటీచేసిన గాజువాకలో జనసేన పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న నాగబాబు  ప్రత్యర్థులపై దారుణమైన కామెంట్స్ చేశారు. నాగబాబు అదుపు తప్పి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. 
 
నాగబాబు మాట్లాడుతూ ‘నా తమ్ముడు పవన్ ని విమర్శించిన వాళ్లు పనికిమాలిన సన్నాసులు, అడ్డగాడిదలు.. వెధవలు అంటూ నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడడం సభలో కలకలం రేపింది. 
 
ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నేతలు, టాలీవుడ్ నటులను ఏకిపారేశారు. జనసేనను తిట్టిన వాళ్లు పెయిడ్ ఆర్టిస్ట్ గాళ్లు అంటూ నోరుపారేసుకున్నారు. టాలీవుడ్ తోటి నటులపై నాగబాబు చేసిన ఈ కామెంట్స్ పెద్ద దుమారం రేపాయి. పవన్ కళ్యాణ్ గురించి పొగిడే క్రమంలో ఇతర పార్టీల టాలీవుడ్ నటులను దారుణంగా తిట్టడంపై టాలీవుడ్ లో దుమారం రేపింది. 
 
నాగబాబు చేసిన వ్యాఖ్యలపై రాజకీయవర్గాలు, టాలీవుడ్ ప్రముఖులు కూడా మండిపడుతున్నారు. రాజకీయాలను మార్చేస్తామంటున్న జనసేన సిద్ధాంతం ఇలా బండబూతులు తిట్టడమేనా? అని ప్రశ్నిస్తున్నారు.