పవర్‌ ఫుల్‌ గా సామి 2 ట్రైలర్‌

తన విభిన్న నటనతో తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్‌ ఏర్పర్చుకున్న కథానాయుకుడు విక్రమ్‌. తాజాగా విక్రమ్ నటించిన చిత్రం సామి 2 . ఈ సినిమాలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌ గా నటుస్తున్నారు. 2003 బ్లాక్‌బస్టర్‌ ‘అరు సామి’కి సీక్వెల్‌గా వస్తోన్న చిత్రమిది. హరి దర్శకుడు. దేవి శ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇందులో విక్రమ్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నారు.

ఈ చిత్రం తమిళ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. యాక్షన్‌ సన్నివేశాలతో అద్యంతం ఆసక్తికరంగా ట్రైలర్‌ను రూపొందించారు. ఈ సినిమా కోసం విక్రమ్‌ మరింత ఫిట్‌గా తయారయ్యారు. మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా..’ అంటూ విక్రమ్‌ సంభాషణలు ఒక పక్క సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలు మరోపక్క ఆకట్టుకుంటున్నాయి. సామి 2 లో జాన్‌ విజయ్‌, ప్రభు, సూరి, బాబీ సింహా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. విక్రమ్‌ సినీ కెరీర్‌లో సూపర్‌ హిట్‌ గా నిలిచిన చిత్రానికి సీక్వెల్‌ కావడంతో దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టు ట్రైలర్‌ కూడా మంచి టాక్‌ అందుకుంది. ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ బాధ్యతల్ని దర్శకుడు హరినే చూసుకుంటున్నారు.