పవర్‌ స్టార్‌ పవన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు సెప్టెంబర్ 2 ప్రముఖ నటుడు, జనసేన అథినేత పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు. ఈ రోజు ఆయన 46వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ రోజు మెగా అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటారు. పవన్‌ పేరిట అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. జనసేన కార్యకర్తలు వీధివీధి వాడవాడలా పవన్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమౌతున్నారు. పవన్ కళ్యాణ్ అసలు పేరు కొణిదెల కల్యాణ్ బాబు. కొణిదెల వెంకటరావు, అంజనా దేవి దంపతుల మూడో కుమారుడు. సెప్టెంబరు 2, 1972న జన్మించాడు. పవన్ కళ్యాణ్ ప్రాథమిక విద్య పశ్చిమగోదావరి జిల్లాలోనే జరిగింది. ఇంటర్ మీడియట్ నెల్లూరు లోని వి.ఆర్.సి కళాశాలలో పూర్తి చేసాడు. పిమ్మట కంప్యూటర్స్ లో డిప్లోమా చేశాడు.


అన్నయ్య చిరంజీవి చాటు తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో అడుగుపెట్టిన పవన్‌ తనదైన మ్యానరిజం, తనదైన స్టైల్ తో అభిమానులకు దగ్గరయ్యారు. అతికొద్ది కాలంలోనే అన్నకు తగ్గ తమ్ముడిగా ప్రేక్షకాదరణ పొందాడు. డైలాగ్స్, లుక్స్, డ్యాన్స్ ఇలా మొత్తనికి గా ఆడియన్స్ న అభిమానం పొంది పవన్‌ స్టార్ గా పవన్ గుర్తింపు పొందారు. పవన్ పేరు చెప్తే చాలు యూత్ లో ఓ పవర్ జనరేట్ అవుతుంది. తన మొదటి సినిమా నుంచి ప్రతి సినిమాలో వేరియేషన్స్ చూపిస్తూ.. ప్రేక్షకులకు దగ్గరయ్యారు పవన్. తొలిప్రేమ సినిమాతో పవన్‌ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. బద్రి.. గబ్బర్ సింగ్ తో తన లెక్కేంటో, తన పవరేంటో సినిమా ఇండస్ట్రీ చూపించారు. అత్తారింటికి దారేదిలో సెంటిమెంట్ ను పండించిన పవర్ స్టార్ 2014 లో జనసేన అనే రాజకీయ పార్టీ స్థాపించారు. పార్టీ స్థాపించిన తరువాత సినిమాలు తగ్గించేశారు.. గోపాల గోపాల.. సర్దార్ గబ్బర్ సింగ్.. కాటంరాయుడు.. అజ్ఞాతవాసి సినిమాలు చేసి.. అక్కడితో సినిమాలకు స్వస్తి చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజా పోరాట యాత్ర పేరుతో తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తాను అనుకున్న రంగంలో ఎదగాలని కోరుకుందాం.