పార్టీ లో కలుసుకున్న ఆ ముగ్గురు స్టార్‌ హీరోలు

జూలై 25 న దర్శకుడు వంశీ పైడిపల్లి పుట్టినరోజు కావడంతో స్టార్‌ హీరోలు మహేశ్‌, ఎన్టీఆర్‌, రాంచరణ లు వంశీ పైడీపల్లి ఇచ్చిన పార్టీలో కలుసుకున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇంతకుముందు ఎన్టీఆర్ , చరణ్ లు నటించగా తాజాగా మహేష్ బాబు ఓ సినిమా చేస్తున్నాడు. వంశీ కాంబినేషన్‌లో.. ఎన్టీఆర్‌ బృందావనం, చరణ్‌ ఎవడు చిత్రాల్లో నటించాగ ఆ చిత్రాలు సూపర్‌ హిట్స్‌ అయ్యాయి. ఇప్పడు మహేశ్ బాబు వంశీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ దర్శకుడు పుట్టినరోజు కావడంతో పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానించాడు.

ఆ వేడుకలో మహేశ్‌, ఎన్టీఆర్‌, చరణ్, పూజా హెగ్డే, దర్శకుడు కొరటాల శివ, నిర్మాత దిల్‌ రాజు కూడా పాల్గొన్నారు. ఇక వీళ్ళతో పాటుగా మరికొంతమంది ప్రముఖులు కూడీ హాజరయ్యారు. మొత్తానికి అగ్ర హీరోలు మందు పార్టీలో కలుసుకోవడం ఆ పిక్స్ బయటకు రావడం ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తే విషయమే. అగ్ర హీరోలు విబేధాలు లేకుండా కలిసి పోతున్నారు కానీ హీరోల అభిమానులు మాత్రం ఒకరిపై ఒకరు కత్తులు దూస్తూ ఉంటారు.