పుట్టినరోజు సందర్భంగా బాబాయ్‌కు అబ్బాయి సర్‌ప్రైజ్‌

‌సెప్టెంబరు 2న పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌‌ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మోగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేశారు. ఈ విషయాన్ని ఉపాసన సోషల్‌మీడియా వేదికగా తెలుపుతూ.. చరణ్‌ మాట్లాడుతున్న వీడియోను పోస్ట్‌ చేశారు. ‘రేపటి వరకు ఎదురుచూడండి’ అని ట్వీట్‌ చేశారు. ‘హాయ్‌.. మరో 24 గంటల్లో మీకో సర్‌ప్రైజ్‌ ఉంది. కల్యాణ్ బాబాయ్‌ పుట్టినరోజు సందర్భంగా ఓ వీడియోను పోస్ట్‌ చేయబోతున్నాం. బాబాయ్‌.. నీకు రేపు ఓ సర్‌ప్రైజ్‌ ఉంది’ అని చరణ్‌ వీడియోలో పేర్కొన్నారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. చరణ్‌ ఏం విడుదల చేయబోతున్నారు? అంటూ ఊహించడం మొదలు పెట్టారు.

చరణ్‌ ప్రస్తుతం తన 12వ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కియారా అద్వాణీ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కోసం అజర్ బైజాన్ వెళ్లారు. అక్కడే 30 రోజులపాటు కీలకమైన సన్నివేశాలను షూట్ చేయబోతున్నారు. ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు పవన్ సినిమాకు సంబంధించి ఎదో ఒక న్యూస్ బయటకు వచ్చేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో పవన్ బర్త్ డే గిఫ్ట్ ను అబ్బాయి రూపంలో ఇవ్వబోతున్నాడు.