పులితో సెల్ఫీ దిగిన నవదీప్‌

చందమామ సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు నవదీప్‌. ప్రస్తుతం అడపదడప కనిపిస్తున్న సినిమా అవకాశాలు లేవు అయినప్పటీకి అభిమానులతో సోషల్‌ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటాడు . తాజాగా నవదీప్‌ ఒక ఫొటోను పోస్టు చేసి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. ఓ అడవిలోకి వెళ్లిన నవదీప్‌, అక్కడ ఉన్న పెద్దపులితో సెల్ఫీ తీసుకున్నాడు. దానికి “ఏరా పులీ” అన్న డైలాగ్‌ని జోడించి, తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకున్నాడు.

ఈ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే ఈ ఫొటోను ఎప్పుడు, ఎక్కడ తీసుకున్నాడన విషయాన్ని మాత్రం నవదీప్‌ వెల్లడించాలేదు. ఇటీవలే హైదరాబాద్‌ సిగ్నల్ కు సంబందించిన ఓ ఫొటోను చేసి, తన లైప్‌ సరైన దిశలో పయనించడం లేదనే క్యాప్షన్‌ పెట్టిన విషయం తెలిసిందే.