పెళ్లి ఆడవారిని మరింత శక్తివంతంగా తయారుచేయాలి

చాలా మంది హీరోయిన్లు పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించుకోవడమో లేకుంటే పూర్తిగా మానేయడమో చేస్తుంటారు. కానీ నటి సమంత మాత్రం అక్కినేని నాగ చైతన్యతో వివాహము తరవాత రెట్టించిన ఉత్సాహంతో సినిమాల్లో దూసుకుపోతున్నారు. వివాహానంతరం ఆమె చేసిన ‘రంగస్థలం, ఇరుంబుతిరై, మహానటి’ లాంటి సూపర్ హిట్ సినిమాల్ని చేసిన ఆమె ప్రస్తుతం ‘యు టర్న్, సీమరాజ, సూపర్ డీలక్స్’ లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఈ సందర్బంగా సమంత ట్విట్టర్ ద్వారా అభిమానులతో మాట్లాడుతూ పెళ్లి అనేది ఆడవారిని మరింత శక్తివంతంగా తయారుచేయాలి. అంతేకానీ వాళ్లకు అడ్డుకాకూడదు. ప్రస్తుతం నేను చాలా బాగా పనిచేస్తున్నాను. ఎందుకంటే వివాహం తర్వాత నేను మునుపటికంటే ఎక్కువ శక్తివంతురాలినయ్యాను అన్నారు.