పెళ్లి గొప్పతనం వివరించే శ్రీనివాస కల్యాణం

నితిన్‌-రాశీఖన్నా జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం.’ ఫ్యామిలీ, ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా.. తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించగా.. దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. ఇదివరకే ఫస్ట్‌ లుక్‌, సాంగ్స్‌తో ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ చిత్రంబృందం ఈరోజు టీజర్‌ను రిలీజ్‌ చేసింది.

టీజర్‌లో…మనం పుట్టినప్పుడు మనవాళ్లందరూ ఆనంద పడతారు అది మనకు తెలీదు. మనం దూరం అయినప్పుడు మనవాళ్లందరూ బాధపడతారు.. అదీ మనకు తెలీదు. మనకు తెలిసి మనం సంతోషంగా ఉండి, మనవాళ్లందరూ సంతోషంగా ఉండేది ఒక్క పెళ్లిలో మాత్రమే. అలాంటి పెళ్లి గొప్పతనం చెప్పే ఓ చిన్ని ప్రయత్నమే మా ఈ శ్రీనివాస కళ్యాణం అంటూ సహజనటి జయసుధ వాయిస్‌ ఓవర్‌తో టీజర్‌ను రిలీజ్‌ చేశారు. కాగా ఈ చిత్రం జూలై 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.