పేప‌ర్‌బాయ్‌ మూవీ రివ్యూ

movie-poster
Release Date
August 31, 2018

దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సంపత్‌ నంది నిర్మాతగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తను నేను ఫేం సంతోష్‌ శోభన్‌ హీరోగా సంపత్‌ నంది నిర్మాణంలో జయశంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘పేపర్‌ బాయ్’‌. ఈ సినిమా ట్రైలర్‌పై మహేష్ బాబు, ప్రభాస్‌ లాంటి స్టార్‌ హీరోలు ప్రశంసలు కురిపించటంతో సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. మరి ఆ అంచనాలను పేపర్‌ బాయ్‌ అందుకున్నాడా.. సంతోష్‌ శోభన్‌ హీరోగా ప్రూవ్‌ చేసుకున్నాడా.. సంపత్‌ నంది నిర్మాతగా విజయం సాధించాడా అనేదీ రివ్యూలో చూద్దాం.

కథ :
హీరో రవి (సంతోష్‌ శోభన్‌) బీటెక్‌ చదివినా కుటుంబ పరిస్థితుల వల్ల పేపర్‌ బాయ్‌గా పనిచేస్తుంటాడు. తన లాంటి ఆలోచనలే ఉన్న ధరణి హీరోయిన్‌ (రియా సుమన్) అనే పెద్దింటి అమ్మాయిని ఇష్టపడతాడు. రవి మంచి తనం విలువలు గురించి తెలుసుకున్న ధరణి కూడా రవిని ఇష్టపడుతుంది. కూతురి ప్రేమకు గౌరవమిచ్చిన ధరణి తల్లిదండ్రులు తమ అంతస్తును పక్కన పెట్టి ఆటో డ్రైవర్‌ కొడుకు, పేపర్‌ బాయ్‌ అయిన రవితో పెళ్లికి ఓకె చెప్తారు. కానీ అనుకోని పరిస్థితుల్లో రవి, ధరణి దూరమవుతారు. వారి విడిపోవడానికి కారణాలేంటి..? వీరి ప్రేమకథకు ముంబైలో ఉండే మేఘ (తాన్యా హోపే)కు సంబంధం ఏంటి..? రవి, ధరణిల ప్రేమకథ ఎలా ముగిసింది..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
రెండో సినిమానే ఎంతో బరువైన పాత్రను ఎంచుకున్న సంతోష్‌ శోభన్‌ ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. లవర్‌ బాయ్‌గా కనిపిస్తూనే ఎమోషనల్‌ సీన్స్‌లో కంటతడి పెట్టించాడు. బాధ్యత గల కుర్రాడి పాత్రలో కనిపించిన సంతోష్‌ ఫుల్‌ మార్క్స్‌ సాధించాడు. హీరోయిన్‌ రియా సుమన్‌ హుందాగా కనిపించారు. నటన పరంగానూ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ సీన్స్‌లో రియా చూపించిన ఎమోషన్స్‌ సూపర్బ్‌. తాన్య హోపే తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఇతర పాత్రలో విద్యుల్లేఖ రామన్‌, మహేష్‌, బిత్తిరి సత్తి, అభిషేక్‌ కాసేపు నవ్వించే ప్రయత్నం చేశారు.

విశ్లేషణ ;
పేదింటి అబ్బాయి.. పెద్దింటి అమ్మాయిని ప్రేమించటం అనే కాన్సెప్ట్ తెలుగు సినిమాకు హిట్ ఫార్ములా. ఇప్పటికే ఇలాంటి కథతో చాలా సినిమాలు వచ్చాయి. అయితే అదే కథను కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు జయశంకర్‌. సంపత్‌ నంది రచన సినిమాకు హెల్ప్‌ అయ్యింది. కవితాత్మకంగా సాగే సంభాషణలు ఆకట్టుకుంటాయి. భీమ్స్‌ సంగీతం, సురేష్‌ బొబ్బిలి నేపథ్య సంగీతం సరిగ్గా కుదిరాయి. అయితే సినిమాను ఇంట్రస్టింగ్‌ పాయింట్‌తో మొదలు పెట్టిన దర్శకుడు ఆ టెంపోను కంటిన్యూ చేయటంలో కాస్త తడబడ్డాడు. నెమ్మదిగా సాగే కథనం ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. అదే సమయంలో కథతో సంబంధం లేని కామెడీ సీన్స్‌ కథనంలో స్పీడ్‌ బ్రేకర్లలా మారాయి. సౌందర్‌ రాజన్‌ సినిమాటోగ్రఫి సినిమాకు కలర్‌ ఫుల్ లుక్‌ తీసుకువచ్చింది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

హైలైట్స్
నేప‌థ్యం
మాట‌లు
డ్రాబ్యాక్స్
కథ
కామెడీ సీన్స్‌

చివరిగా : పేప‌ర్‌ కొత్తదే ‌.. కథే పాతది
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

చిత్రం: పేప‌ర్‌బాయ్‌
న‌టీన‌టులు: సంతోష్‌ శోభ‌న్, రియా సుమ‌న్, తాన్యా హోప్, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు
సంగీతం: భీమ్స్ సిసిరేలియో
ద‌ర్శ‌క‌త్వం: జ‌య‌శంక‌ర్
నిర్మాత‌లు: స‌ంప‌త్ నంది, రాములు, వెంక‌ట్, న‌ర‌సింహా
సంస్థ‌: స‌ంప‌త్ నంది టీం వ‌ర్క్స్, బిఎల్ఎన్ సినిమా, ప్ర‌చిత్ర క్రియేష‌న్స్

Critics METER

Average Critics Rating: 2
Total Critics:3

AUDIENCE METER

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

పేప‌ర్‌ కొత్తదే ‌.. కథే పాతది
Rating: 2.5/5

www.klapboardpost.com

పేప‌ర్ బాగుంది.. వార్త‌లే బోర్‌
Rating: 2.25/5

www.telugu360.com

పేపర్ బాయ్.. మధ్యలో దారి తప్పాడు
Rating: 2.25/5

http://www.tupaki.com