ప్రణతి నుండి అభయ్‌ను కాపాడలేకపోతున్నా

సోషల్‌ మీడియా వేదికగా వ్యక్తిగత విషయాలను పెద్దగా వెల్లడించని కథానాయకుడు ఎన్టీఆర్‌ తాజాగా ఓ ఆసక్తికరమైన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. తన సతీమణి ప్రణతి దగ్గరుండి కుమారుడు అభయ్‌ను కూర్చోబెట్టి పాలు తాగిస్తున్న ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. అందులో అభయ్‌ తన తల్లిని చూస్తూ.. భయపడుతూ పాలు తాగుతున్నాడు.

ఈ ఫొటోను ఉద్దేశించి. ‘రోజూ పాలు తాగాల్సిన సమయం వచ్చినప్పుడూ సూటిగా చూస్తున్న అతని తల్లి నుంచి అభయ్‌ను రక్షించలేకపోతున్నా’ అంటూ ట్విటర్‌లో చెప్పుకొచ్చారు. దీనికి అభిమానుల నుంచి తెగ రియాక్షన్స్‌ వచ్చాయి. ‘చిన్నప్పుడు మా అమ్మ కూడా అంతే, నాకు కూడా పాలంటే ఇష్టం లేదు, క్యూట్‌’ అంటూ తెగ కామెంట్స్‌ చేశారు.

ఎన్టీఆర్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ‘అరవింద సమేతా..’ చిత్రంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. తమన్‌ బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.