ప్రభాస్‌ ‘సాహో’ ఆలస్యమౌతుందని అభిమాని ఆత్మహత్య

చాలా మంది చిన్నచిన్న విషయాలకు ఆత్మహత్య చేసుకుంటూ.. ఉంటారు. ఈ ప్రపంచలో పరిష్కరం లేని సమస్య అంటూ.. ఏమీ ఉండాదు. కూర్చుని పరిష్కరించుకుంటే జీవితాన్ని చక్కగా జీవించవచ్చు. కానీ కొందరు అత్యంత మూర్ఖంగా సిల్లీ కారణాలతో ఆత్మహత్యలు చేసుకుని కన్నవాళ్ళ కడుపుకోత మిగిలిస్తున్నారు. హీరోల కోసం ప్రాణాలిచ్చేంత అభిమానం వుండాలి కానీ ప్రాణాలు తీసుకునేంత కాదని ఎప్పుడు తెలుసుకుంటారో ? ప్రభాస్ తాజా సినిమా ‘సాహో’ సినిమా ఆలస్యం అవుతోందని ప్రభాస్ అభిమాని ఒకరు సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు.

200 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత భారీగా రూపొందుతోంది సాహో. చిత్రీకరణ కూడా చివరిదశకు చేరుకుంది. ఈ సినిమా విషయంలో చిత్ర యూనిట్ పబ్లిసిటీకి చాలా దూరంగా వుంటోంది. దీంతో ప్రభాస్ అభిమాని ఒకరు మనసుకు తీసుకున్నాడు.

సూసైడ్ లెటర్ రాసిమరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమ హీరో సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వడం లేదని.. అందుకే మనస్తాపంతో తానూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసాడు. ఈ విషయం తెలిసిన ప్రభాస్ చాలా బాధపడ్డాడట. ‘హీరోల కోసం ప్రాణాలు తీసుకోవడం దారుణం. మాకోసం ప్రాణాలు తీసుకునే ముందు మీ అమ్మానాన్నల గురించి ఆలోచించండి’ అని బాధపడ్డాడట.