ప్రభాస్ కజిన్ “సిద్ధార్థ్” హీరోగా రీ ఎంట్రీ?..

ప్రభాస్ కజిన్ “సిద్ధార్థ్” హీరోగా రీ ఎంట్రీ?..
 
ప్రభాస్ కజిన్ సిద్దార్థ్ హీరోగా గతంలో “బ్లాక్ & వైట్”, “ప్రియుడు” తదితర చిత్రాలను నిర్మించిన నిర్మాత పి.ఉదయ్ కిరణ్ తాజాగా మరో చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రం ద్వారా సురేష్ రేపల్లె దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సిద్ధార్థ్ గతం లో “కెరటం” అనే చిత్రం లో నటించాడు. ఇప్పుడు తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ప్రొఫెషనల్ గా మరలా ఈ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీనికి సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరోలియో , “బాహుబలి” చిత్రానికి ఆపరేటివ్ కెమెరామెన్ గా పనిచేసిన బాలు కెమెరామెన్ గా ఎంపికయ్యారు. ఈ చిత్రం షూటింగ్ అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతోందని ఫిలిం నగర్ సమాచారం.
CLICK HERE!! For the aha Latest Updates