ప్రముఖ దర్శక నిర్మాతపై శ్రీ రెడ్డి ఫిర్యాదు

కాస్టింగ్‌ కౌచ్‌ వివాదంతో వార్తల్లో నిలిచిన నటి శ్రీ రెడ్డి.. ప్రముఖ దర్శక నిర్మాత వారాహిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా తనపై తీవ్ర ఆరోపణలు చేసిన కోలీవుడ్‌ నటుడు, ప్రముఖ దర్శకుడు వారాహి తనకు ఫోన్‌ చేసి తనను బెదిరించారంటూ.. చెన్నై పోలీసు కమిషనర్‌కు శుక్రవారం ఓ ఫిర్యాదు లేఖను ఆమె అందజేసింది. ‘ సినిమాల్లో అవకాశాలు ఇస్తామని నమ్మించి లైంగిక కోర్కెలు తీర్చుకుంటున్న వారి బండారాన్ని నేను బయటపెడుతున్నాను. అయితే గత 24వ తేదీన నటుడు, దర్శక, నిర్మాత వారాహి.. మీడియాలో సమావేశంలో నన్ను వ్యభిచారిగా చిత్రీకరిస్తూ.. నా గురించి తప్పుగా మాట్లాడారు. నాకు ఫోన్‌ చేసి బెదిరించారు. ఇది నన్ను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. వారాహిపై లైంగిక వేధింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’ అని ఫిర్యాదులో పేర్కొంది శ్రీరెడ్డి.

గత కొన్ని రోజుల క్రితం ప్రముఖ దర్శకుడు మురగదాస్‌, లారన్స్‌, శ్రీకాంత్‌లపై ఆమో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.. వారాహి మీడియా సమావేశం నిర్వహించి మరీ శ్రీ రెడ్డిపై వేశ్య ఉంటూ.. కామెంట్లు చేశారు. దీనిపై సోషల్‌ మీడియా వేదికపై ఆమె హెచ్చరించారు కూడా. ఇక నటీమణులపై లైగింక వేధింపుల గురించి నడిగర్‌ సంఘం అధ్యక్షుడు నాజర్‌, ప్రధాన కార్యదర్శి విశాల్‌, కోశాధికారి కార్తీలకు ఫిర్యాదు చేయాలని ప్రయత్నించినా. వాళ్లు తనను పట్టించుకోలేదని శ్రీ రెడ్డి ఆరోపిస్తున్నారు. త్వరలో పూర్తిగా చెన్నైలో స్థిరపడే ఆలోచనలో ఉన్నట్లు ఆమె వెల్లడించింది. ఇంటర్వ్యూలో వెల్లడించారు.