ప్రియుడితో ముంబై వచ్చిన ప్రియాంక!

హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా చాలా రోజుల తర్వాత ఇండియాకు వచ్చారు. తనతో పాటు తన ప్రియుడైన హాలీవుడ్‌ నటుడు నిక్‌ జొనాస్‌ను కూడా ముంబయి వచ్చినట్లు అక్కడి మీడియా వర్గాలు చెబుతున్నాయి. ముంబయి ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్నప్పుడు ప్రియాంక-నిక్ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ముఖం కన్పించకుండా నిక్‌ విండో కర్టెన్‌తో కవర్ చేసుకున్నారు. ముఖం‌ మూసుకున్నప్పటికీ అతని గెడ్డం కన్పించడంతో నిక్‌ కూడా ముంబై వచ్చాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రియాంక ప్రియుడైన నిక్‌ను తన తల్లి మధుకు పరిచయం చేయడానికి ముంబయికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రియాంకను నిక్ జొనాస్ తన తల్లిదండ్రులకు పరిచయం చేశారు. ఇటీవల ప్రియాంక ముంబయి వచ్చినప్పుడు వర్సోవా బీచ్‌ వద్ద 15 పడక గదులున్న విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారు. త్వరలో ఈ బంగ్లాలో గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ పార్టీలో నిక్‌ కూడా పాల్గొనబోతున్నారట. ఇదే వేడుకలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్‌లో ‘ఎ కిడ్‌ లైక్‌ జేక్’ ‘ఇజింట్‌ ఇట్‌ రొమాంటిక్’ ‘క్వాంటికో’ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లో ‘భారత్’ సినిమాలో నటిస్తున్నారు. ప్రియాంక ఈ సినిమా కోసం దాదాపు రూ.12 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. దీనిలో సల్మాన్‌కు జోడీగా ప్రియాంక నటించనున్నారు. ఈ చిత్రానికి అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించనున్నారు.