‘ప్రేమకు రెయిన్‌చెక్‌’ టైటిల్ పోస్టర్

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా గోపాల గోపాల, సర్దార్‌ గబ్బర్‌ సింగ్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన శరత్‌ మరార్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్స్ సమర్పణలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ప్రేమకు రెయిన్‌చెక్‌’. ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో ట్రెండీ లవ్‌ స్టోరిగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ పోస్టర్ ను ఈ రోజు (శనివారం) విడుదల చేశారు. “రెయిన్ చెక్” అంటే ఇచ్చిన ఆఫర్ ను భవిష్యత్ లో తీసుకుంటాను అని అర్ధం.

ఈ చిత్రంలో నూతన నటీనటులు అభిలాష్ వడాడ, ప్రియా వడ్లమాని, మౌనికా తవనం హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను త్వరలో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆగస్టులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకోచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.