‘ప్రేయసి’తో చైతు!

అక్కినేని నాగ చైతన్య ‘నిన్నుకోరి’ సినిమాతో మంచి విజయం సాధించిన డైరెక్టర్ శివ నిర్వాణతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమాను రూపొందించనున్నారు. డివివి దానయ్య ఈ సినిమాకు నిర్మాత‌. కోన వెంకట్ కథ స్క్రీన్ ప్లే అందించబోతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాలో సమంత గెస్ట్ రోల్ లో కనిపించనుంది. ఈ సినిమాకు ‘ప్రేయసి’ అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్లు తాజా టాక్. ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ రెండో వారంలో ప్రారంభంకానుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డికానున్నాయి.

ప్ర‌స్తుతం చైతు ‘స‌వ్య‌సాచి’, ‘శైల‌జా రెడ్డి అల్లుడు’ చిత్రాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సవ్యసాచి’ సినిమా జూన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో చైతు సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనుంది.