ఫిట్‌నెస్‌ పిక్‌ పోస్ట్‌ చేసిన కత్రినా

బాలీవుడ్ పాపులర్ అందాల నటి కత్రినా కైఫ్ అందం గురించి చెప్పనవసరం లేదు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కత్రినా తన తాజా చిత్రాన్ని పోస్ట్ చేసిన పిక్ చూస్తుంటే తనలో ఉండే మరో టాలెంట్ కనిపిస్తోంది. హాట్ హాట్ దుస్తులతో మంచి ఫిట్‌నెస్‌తో ఉన్న బ్లాక్ అండ్ వైట్ పిక్‌ను చూస్తుంటే కుర్రకారు హృదయాలు ఉర్రూతలూగక మానవు. ఈ చిత్రం ఏదైనా సినిమాకు సంబంధించినదా లేక ఫొటో షూట్‌కు సంబంధించినదా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

సల్మాన్ ఖాన్‌తో గతేడాది బ్లాక్ బస్టర్ మూవీ టైగర్ జిందా హై చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ తర్వాత అమీర్ ఖాన్‌తో టగ్స్ ఆఫ్ హిందూస్థాన్, షారుక్ ఖాన్‌తో జీరో సినిమాల్లో నటిస్తోంది. జీరో సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నారు.