ఫ్యాన్స్ కోసం మంచి కథ వదిలేశాడు!

అక్కినేని అఖిల్ నటించిన రెండు సినిమాలు కూడా ఆశించిన విజయాన్ని అందించలేకపోయాయి. దీంతో మూడో సినిమాతో అయినా హిట్ అందుకోవాలని అక్కినేని అభిమానులు ఆతురతగా ఎదురుచూస్తున్నారు. అయితే వారి కారణంగానే అఖిల్ ఓ మంచి కథను వదులుకున్నాడని తెలుస్తోంది. ఈమధ్య నాగార్జున అభిమానులు కొంతమంది కలిసి అఖిల్ తో ‘హలో’ లాంటి ప్రయోగాలు చేయించవద్దని స్పెషల్ గా నాగార్జునను కలిసి రిక్వెస్ట్ చేశారట. దీనితో అఖిల్ తన మూడవ సినిమాగా చేద్దాము అనుకున్న ఒక ఎడ్వంచర్ కథని వదులుకోవాల్సి వచ్చిందట.
ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళ్ళితే ఆది పినిశెట్టి సోదరుడు దర్శకుడు సత్య పినిశెట్టి ఒక సరికొత్త కథను చెప్పి నాగ్ ని అదేవిధంగా అఖిల్ ని మెప్పించాడట. అయితే ఎడ్వంచర్ మూవీలు కొన్ని వర్గాల ప్రేక్షకులకు మాత్రమే నచ్చుతాయి అన్న భావనతో నాగ్ కాంపౌండ్ ఈ కథను వదులుకుని ‘తొలిప్రేమ’ తీసిన వెంకీ అట్లూరికి ఈఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.