బయోపిక్ మొదలుకానుంది!

తెలుగుజాతి గర్వించే నటుడు విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకూండా రాజకీయాల్లో చేరి ప్రజలకు తనవంతు సేవలు చేసాడు. ఈ మద్య సినీ, రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చకున్న వారి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తీస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆదారంగా ‘మహానటి’ సినిమా తీస్తున్నారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ తీయడానికి సిద్దమైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ మద్య ఎన్టీఆర్ బయోపిక్ పై రక రకాల రూమర్లు పుట్టుకొచ్చాయి.వాటన్నింటికి ఖండిస్తూ.. డైరెక్టర్ తేజ తాజాగా ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త చెప్పారు. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్‌పై తీయనున్న బయోపిక్‌కు ముహుర్తం తేదీని వెల్లడించారు. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కబోయే ఈ సినిమాను గురువారం (మార్చి 29) ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కూడా హాజరు కానున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates