బాక్సాఫీసును ధడదఢలాడిస్తోంది

శ్రీదేవి కూతురు జాన్వి తొలి సినిమా ధడక్‌ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ నెల 20న విడుదలైన ఈ సినిమా తొలి రోజు దేశవ్యాప్తంగా 8.71 కోట్లు రాబట్టిందని, 3 రోజుల్లో రూ. 33.67 కోట్లు వసూలు చేసిందని సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. శ్రీదేవి కూతురు జాన్వి నటించిన తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకోగలిగింది. పలువురు సినీ ప్రముఖులతో పాటు సినీ విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. మొదటి సినిమాలోనే జాన్వి తన నటనతో ఆకట్టుకుందని అంటున్నారు.

‘ధడక్‌’ సినిమాలో హీరో షాహిద్‌ కపూర్‌ సోదరుడు ఇషాన్‌ ఖట్టర్ కథానాయకుడిగా నటించారు. అశుతోష్‌ రానా, అంకిత్‌ బిష్ట్‌, ఆదిత్య కుమార్‌ ప్రధాన పాత్రల్లో కనిపించారు. శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు కరణ్‌జోహార్‌, అపూర్వ మెహతా నిర్మాతలు. మరాఠీ బ్లాక్‌బస్టర్‌ ‘సైరాత్’కు హిందీ రీమేక్‌ ఇది. వేర్వేరు కులాలకు చెందిన అబ్బాయి, అమ్మాయికి మధ్య ప్రేమ పుట్టడం, వారి ప్రేమను పెద్దలు వ్యతిరేకించడం అనే కథాంశంతో రూపొందిన సినిమా.

CLICK HERE!! For the aha Latest Updates