బాబాయ్‌కు గాలిలో బర్త్ డే విషెష్ చెప్పిన రామ్‌ చరణ్‌

ఈరోజు ప్రముఖ నటుడు ,జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును అభిమానులు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయనకు వివిధ తరహాలో శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక మెగా హీరోలు సైతం పవన్ పుట్టినరోజును ప్రత్యేకంగా ఫీలవుతున్నారు. ముఖ్యంగా అబ్బాయి మెగా పవర్‌ స్టార్‌
రామ్ చరణ్.

ఉపాసనతో కలిసి ఫారిన్ ట్రిప్ కు వెళ్లిన చరణ్ బాబాయ్ పవన్ కు పారా గ్లైడింగ్ చేస్తూ, గాల్లో ఎగురుతూ సినిమాల్లోనూ, జీవితంలోనూ ఇలాంటి సాహసాలు చేయడానికి ధైర్యం ఇచ్చింది మీరే అంటూ పవన్ కళ్యాణ్ కు బర్త్ డే విషెష్ చెప్పి సప్రైజ్ చేశారు.