బాబుకు షాకిచ్చిన వేణుమాధవ్. ఉత్తమ్ కు జలకే..

పసుపుపచ్చ పార్టీ అంటే ఆ కమెడియన్ కు ఆది నుంచి అభిమానం.. అన్న ఎన్టీఆర్ అన్న.. నేటి చంద్రబాబు అన్న చెవి కోసుకుంటాడు.. టీడీపీ సానుభూతిపరుడిగా ఉంటూనే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో మిమిక్రీ చేస్తూ ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నాడు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి స్టార్ కమెడియన్ గా అవతారం ఎత్తాడు వేణుమాధవ్. ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో రాజకీయ బాట పట్టాడు.

అప్పట్లో కర్నూలు జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం కూడా చేశారు. బాబు ను కొనియాడుతూ ప్రచారంలో సెంటర్ ఆఫ్ ఎట్రక్షన్ గా మారాడు.. బాబు మాట వేదవాక్కుగా భావించే వేణుమాధవ్ తాజాగా చంద్రబాబు షాకిచ్చే నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా మహాకూటమితో జట్టుకట్టిన టీడీపీకి దిమ్మదిరిగే పనిచేశాడు..

మహాకూటమి తరఫున పీసీసీ చీఫ్ ఉత్తమ్ భార్య పద్మావతి కోదాడ బరిలో నిలుస్తోంది. ఆమెకు టికెట్ కూడా ఖాయమైంది. ఈ నేపథ్యంలోనే కోదాడకు చెందిన వేణుమాధవ్ తాజా ఎన్నికల్లో తాను స్వతంత్రుడిగా బరిలో దిగుతున్నట్టు మీడియాకు సమాచారం ఇచ్చాడు. తనది కోదాడే అని.. ఆది నుంచి ఇక్కడే పుట్టి పెరిగానని.. చంద్రబాబు టికెట్ ఇవ్వకున్నా స్వతంత్రుడిగా పోటీచేస్తానని ప్రకటించారు.

ఇలా చంద్రబాబుపై అభిమానం.. సీట్లు, పదవుల వరకు వచ్చేసరికి వేణుమాధవ్ కు గుర్తుకురాలేదు.. బాబు రాజకీయాల్లో వాడుకునే వైనం బాగా తెలుసు కాబట్టే వేణుమాధవ్ ఇలా చేశాడని రాజకీయవిశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబుతో విభేధించి ఏకంగా ఉత్తమ్ భార్యపైనే వేణుమాధవ్ బరిలోకి దిగబోతున్నాడు. మరి దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తాడనేది ఆసక్తి గా మారింది.