బాబును నమ్మి మునిగిపోయినట్టేనా.?

తెలుగు తమ్ముళ్లలో ఇప్పుడు ఒకటే నిరాశ.. చంద్రబాబు ఎత్తులు పారడం లేదట.. ప్రజాసంక్షేమ జల్లు ప్రజలకు ఊరట నివ్వడం లేదట.. ఆయన ప్లాన్లన్నీ బెడిసికొడుతున్నాయట… చంద్రబాబును నమ్మి ఈసారి నిండా మునిగిపోయినట్టేనా అని తెలుగు తమ్ముళ్లలో ఆవేదన వ్యక్తమవుతోంది.

వరుసగా టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్న ప్రముఖులు ముందే సర్దుకుంటున్నారు. ఇక బాబును నమ్మి ఈసారి ఓడిపోయే జాబితాలో చాలా మందే ఉన్నారట.. వారంతా ఇప్పుడు బాబు తప్పుడు నిర్ణయాలకు బలై పోతున్నామని తలు బద్దులు కొట్టుున్నారట..

సార్వత్రిక ఎన్నికలకు ప్రకటన వెలువడినప్పటి నుంచి బాబు టికెట్ల కేటాయింపు.. అలసత్వం.. ఎత్తుగడలన్నీ వేస్ట్ అయిపోతున్నాయని.. ఎన్నికల్లో వైసీపీకే లబ్ధి చేకూరుతుందన్న వాదనతో తెలుగు తమ్ముళ్లు, పచ్చనేతల్లో కంగారు మొదలైంది.

ఈసారి పొత్తు లేకపోవడం కూడా టీడీపీపై ప్రభావం చూపుతోంది. అటు బీజేపీ, ఇటు జనసేన వైరి వర్గాలు మారిన వేళ బాబును నమ్మి ఎన్నికల కార్యక్షేత్రంలో దిగుతున్న తెలుగు తమ్ముళ్ల పరిస్థితి ఏమాత్రం బాగా లేదని టాక్.

CLICK HERE!! For the aha Latest Updates