బాబు గట్టెక్కడం కష్టమేనంటున్న ఇంటలిజెన్స్ రిపోర్టులు

ఏపీలో ఈసారి సీన్ రివర్స్ కాబోతోంది. అధికార మార్పిడి ఖాయంగా కనిపిస్తోందా…? చంద్రబాబు సీక్రెట్ గా చేయించిన ఇంటలిజెన్స్ సర్వేలో ఓటమి ఖాయమని బయటపడిందా.? అంటే ఔననే అంటున్నాయి సన్నిహిత వర్గాలు.

ఈసారి సర్వేలన్నీ ఏపీలో టీడీపీ ఓడిపోతుందని ఘంఠా బజాయించి చెబుతున్నాయి. చంద్రబాబు ఇవి నమ్మలేక సొంతంగా ప్రభుత్వం యంత్రాంగంతో కలిసి ఇంటలిజెన్స్ సాయంతో సర్వే నిర్వహించుకున్నట్టు టాక్. ఆ సర్వేలో తెలుగుతమ్ముళ్లే చంద్రబాబును ముంచేస్తారంటూ గ్రౌండ్ రిపోర్టులో అందాయట.. దీంతో బాబు హతాశుడయ్యాడని సమాచారం.

ఈ ఎన్నికల్లో చంద్రబాబు కేసీఆర్-మోడీ-జగన్ బూచీ చూపి సెంటిమెంట్ రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవాలనే ఎత్తుగడ పనిచేయదని తేలిందట. అవకాశవాదం పనిచేయదని.. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని.. అదే ముంచేస్తోందని తెలిసిందట..

ఇప్పుడు ఇంటలిజెన్స్ రిపోర్టుతో చంద్రబాబుకు అన్నీ తెలిసిపోయాయి. తానిక దొరికిపోయానని అర్థమైపోయిందట.. అందుకే తాజాగా కొత్త పల్లవి అందుకున్నాడట.. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టుగా దొంగే.. దొంగా అని అరిచి గోలపెడుతున్నాడని టీడీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి.

ఇక బాబుకు ఓటమి భయం వెంటాడుతుండడంతో ఆయన అనుకూల పచ్చ పత్రికలు, మీడియా రంగంలోకి దిగింది. బాబు గోలను కళ్లకు అద్దుకొని.. అక్షరాలతో ప్రజల కళ్లకు గంతలు కట్టే పనిలో పడ్డాయి. పేజీల కొద్ది అసత్యాలను సత్యాలు భ్రమింపచేసే పనిలో పడ్డాయి. చూడాలి మరి బాబు అండ్ అనుకూల ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో..

CLICK HERE!! For the aha Latest Updates