బాలీవుడ్‌కు తారక్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ మంచి దూకుడు మీద ఉన్నాడు. జై లవకుశ హిట్ కావడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అరవింద సమేత చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ సినిమా పూర్తయ్యాక రాజమౌళి దర్శకత్వం లో మల్టీస్టారర్ చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రానికి సంబందించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

టాలీవుడ్ ప్రముఖ హీరోలు బాలీవుడ్ లో నటించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్.. తుఫాన్ మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఇదే బాటలో తారక్‌ కూడా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, దర్శకుడు శశాంక్ కైతాన్ తో కలిసి వచ్చి ఎన్టీఆర్ కు కథ వినిపించారట. కథ నచ్చడంతో ఎన్టీఆర్ ఓకే చెప్పాడట. ఇందులో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేస్తున్నాడా లేద.. ఫుల్ రోల్ చేస్తున్నాడా..? ఎన్టీఆర్ రోల్ ఏంటి అన్నది తెలియాల్సి ఉంది. కరణ్ జోహార్ ఈ సినిమాకు నిర్మాత. ‘రణ్ భూమి’ పేరుతో నిర్మితమౌతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని 2020 దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు సమాచారం.