బాలీవుడ్ అగ్ర దర్శకుడికి నో చెప్పిన ప్రభాస్

ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీపై తాజాగా వార్తలు వస్తున్నాయి. అక్కడ ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ కు ప్రభాస్ నో చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం సాహో సినిమాతో దుబాయిలో బిజీగా ఉన్న ప్రభాస్ మరో నెలపాటు అక్కడే ఉండబోతున్నాడు. పలు యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. బాహుబలి తర్వాతి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆ రేంజ్ లోనే ఉన్నాయి. 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే బాలీవుడ్ లో 120 కోట్లకు టీసిరీస్ గుల్షన్ కుమార్ కొన్నారు. సో.. ఇప్పట్లో ప్రభాస్ బాలీవుడ్ ప్రయాణం లేనట్లేనని తెలుస్తోంది. కథ నచ్చితే నటిస్తానని ప్రభాస్ ఇదివరకే చెప్పాడు. ఆ మధ్య
ప్రభాస్ పై కరణ్ కాంట్రవర్సీ కామెంట్ చేయడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది.

సాహో తర్వాత కూడా ప్రభాస్ చాలా బిజీగా ఉండబోతున్నారు. ప్రభాస్ ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ తో ఓ చిత్రానికి ఓకే చెప్పాడు. ఇది కూడా 130 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందనుంది. యువీ క్రియేషన్స్ తో పాటు, గోపీకృష్ణ బ్యానర్ లో కష్ణంరాజు ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. రంగస్థలం తరహాలో 70, 80 దశకంలోని కథాంశంతో రూపొందనున్నట్లు సమాచారం. బిల్లా తర్వాత కృష్ణం రాజు నిర్మిస్తున్న సినిమా ఇది.