బాల‌య్య 103 వ చిత్రం

నంద‌మూరి బాల‌కృష్ణ త‌న 103 వ చిత్రం వీవీ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతుంది. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందే
ఈ ప్రాజెక్టును ఈ నెలాఖ‌రున లాంచ్ చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం బాల‌య్య ఎన్టీఆర్ బ‌యోపిక్ ప‌నుల్లో బిజీగా వున్నారు. ఈ
పాటికే సెట్స్ లోకి అడుగుపెట్టాల్సిన ఈ చిత్రం డెరెక్ట‌ర్ తేజ వైదొల‌గ‌డం తో కాస్త ఆల‌స్యం అవుతోంది. ఈ చిత్రానికి సి.క‌ళ్యాణ్
నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

గ‌తంలో బాల‌య్య – వీవీ వినాయ‌క్ కాంబినేషన్‌లో చెన్న‌కేశ‌వ‌రెడ్డి చిత్రం వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది
సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ-ప్రొడ‌క్ష‌న్ ప‌నులు
జ‌రుగుతున్నాయి. లాంఛ్ అయిన త‌రువాత రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. దీనికి సంబంధించి మ‌రిన్ని వివరాలు
తెలియాల్సి ఉంది.