బాహుబలి2 కూడా లీకైందా..?

బాహుబలి మొదటి పార్ట్ కు సంబంధించి కొన్ని యుద్ధసన్నివేశాలు అప్పట్లో లీక్ అవ్వడంతో రాజమౌళి నా దగ్గర పని చేసే వాళ్లే ఇలా చేస్తే నా పరిస్థితి ఏంటని వాపోయారు. దీంతో పార్ట్2 విషయంలో ఇలాంటివి రిపీట్ కాకూడదని తగు జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమాకు సంబంధించిన సర్వర్ ను జర్మనీలో భద్రపరిచారు. అయినపట్టికీ ఈ సినిమాలో కొన్ని సీన్లు లీక్ అయినట్లుగా తెలుస్తోంది. సోమవారం రాత్రి నుండి సినిమాకు సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి. వాటిని చూస్తుంటే ఫస్ట్ పార్ట్ సన్నివేశాలని అనిపించడంలేదు.
 
బాహుబలి పార్ట్ 1లో చూడని సన్నివేశాలు, అలానే పార్ట్2 ట్రైలర్ లో కూడా లేని సన్నివేశాలు కనిపించడంతో బాహుబలి పార్ట్2 కూడా లీకైందా..? అనే అనుమానాలు కలుగ్తున్నాయి. అయితే నిన్న ప్రసాద్ ల్యాబ్ లో నిర్మాతలకు బాహుబలి2 షో వేసినట్లు సమాచారం. ఆ షో లో ఉన్న కొందరు ఆకతాయిలు స్క్రీన్ షాట్స్ తీసి పంపి ఉంటారని టాక్. అయితే ఈ స్క్రీన్ షాట్స్ ఎవరు తీశారనే విషయంపై చిత్రబృందం చర్చలు జరుపుతుంది. ఇంతవరకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. సినిమా రిలీజ్ టైమ్ వచ్చేసరికి ఇలా జరగడం చిత్రబృందాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.