బిగ్‌బాస్‌లో మంచు లక్ష్మీ సందడి

బిగ్‌బాస్‌ సీజన్‌-2లో ఈ రోజు (ఆదివారం) మంచు లక్ష్మీ సందండి చేయనుంది. తాజాగా తను నటించిన చిత్రం W/O రామ్‌ ప్రమోషన్‌లో భాగంగా బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ శుక్రవారం విడుదలైన W/O రామ్‌ డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి కలిగించేందుకు బిగ్‌బాస్‌-2 వేదికగా ప్రచారం నిర్వహించనుంది.. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌తో కలిసి మంచు లక్ష్మీ సందడి చేయనుంది. కాగా బిగ్‌బాస్‌ ఈరోజు ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదల చేసింది ‘స్టార్‌ మా’. ఈ ఎపిసోడ్‌లో హోస్ట్‌ నాని, మంచు లక్ష్మీల మధ్య జరిగిన సంభాషణ ఆసక్తి కలిగించే విధంగా ఉన్నాయి.