బిగ్‌బాస్‌లో సత్తా చూపిన సామాన్యుడు

తెలుగు బిగ్‌బాస్‌-2 లో ఈ వారం బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చాడు నాని. ఈ వారం ఎలిమినేషన్ లేకుండా ఇప్పటికే హౌస్‌ నుండి బయటకు వెళ్ళిన సభ్యులను మళ్లీ ఇంటిలోకి పంపడం కోసం ఓట్లు వేయాలని ప్రేక్షకులను కోరాడు గతవారం. ఈ వారం నాని ఎప్పటిలాగనే ఇంటి సభ్యులతో గతవారం అంత ఇంటిలో జరిగిన విషయాలపై వివరణ అడిగాడు. గీతా మాధురిని రెండోసారి కెప్టెన్‌ అయినందుకు అభినందించాడు. నందు మిమ్మల్ని పెళ్లి చెసుకోవడం 100% కరెక్ట్‌ అని అన్నాడు.

ఇక బాబు గోగినేనిని ఇంకొకరి అభిప్రాయాలను తప్పుబట్టే అధికారం మీకు ఎక్కడిది? అన్నాడు. నేను హిందూ.. మా నానమ్మ క్రిస్టియన్‌.. నేను చర్చికి వెళ్తాను. అది నా ఇష్టం వెళ్లకూడదు అని ఏ డిక్షనరీలో రాసి ఉంది అని నాని బాబుతో అన్నాడు. ఎలిమినేషన్‌ కోసం ఎంపికైన బాబు, నందిని, అమిత్‌, గణేష్‌, దీప్తి సునైనా, కౌషల్‌ కు ఇంటిలోనే ఎలిమినేషన్‌ టాస్క్‌ ఇచ్చి మిగతా ఇంటి సభ్యులకు వీరిలో ఎవరు హౌస్‌లో ఉండలనుకుంటున్నారో.. ఎందుకో? ఎవరు బయటకు వెళ్లి పోవాలి అనుకుంటున్నారో చెప్పాలన్నాడు. అలాగే వారిపై నీటి బెలూన్స్‌ని విసరమన్నాడు.

ఆ తరువాత ఈ వారం ఎలిమినేషన్‌లో ఎవరు లేరు.. ఇక మనం మళ్లీ వచ్చే వారం కలుద్దాం.. అంటూ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. ఆ తరువాత ఈ వారం ఇంటిలోకి రీఎంట్రీ ఇవ్వబోయే సభ్యులను స్టేజ్‌ మీదకు ఆహ్వనించాడు. ఈ వారం ఇంటిలో రీ ఎంట్రీ ఇచ్చే సభ్యులు ఎవరు అంటే శ్యామల, నూతన్‌ నాయుడు.. వీరిలో నూతన్‌ నాయుడుకి అత్యధిక ఓట్లు నమోదయ్యాయి. బిగ్‌బాస్‌ హిస్టరీలోనే అత్యధికంగా ఓట్లు నమోదైన వ్యక్తి అని నాని అన్నాడు. అయితే వీరు ఇంటిలో ఎంట్రీ ఎప్పుడిస్తారు అనేది
మాత్రం బిగ్‌బాస్ నిర్ణయిస్తారు అంటూ ముగించాడు.