బిగ్‌బాస్‌ నుంచి కిరీటి ఔట్‌

బిగ్‌బాస్‌2 ఈ రోజు చాలా ఆసక్తికరంగా జరిగింది. నాని తన హోస్టింగ్‌ తో ప్రతి రోజు కొంచెం, కొంచెం మసాలా యాడ్‌ చేస్తున్నాడు. నాని ఈ వారం తాబేలు-కుందేలు కథ చెప్పి షో మొదలుపెట్టాడు. తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. సభ్యులందరికీ టాస్క్‌ ఇచ్చాడు, ప్రతి సభ్యుడి గురించి ఒక సినిమా టైటిల్‌ చూపించి అది వారికి సరిపోతుందో లేదో మిగతా సభ్యులను ఎస్ ఆర్‌ నో చెప్పమన్నాడు.

ఈ రోజు ఎలిమినేట్‌ జోన్‌లో నుంచి గీతా మాధురి, గణేష్‌ సేఫ్‌ జోన్‌లోకి వెళ్ళారు. కిరీటి హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యాడు. కిరీటి స్టేజ్‌ మీదకు వచ్చిన తరువాత కుటుంబ సభ్యులుకు, తనకు ఉన్న డౌట్‌ ను తొలగించుకున్నాడు. ఈ వారం బిగ్‌బాంబ్‌ ను కిరీటి వెళ్తు వెళ్తు గీతా మాధురి పై విసిరాడు. అయితే హౌస్‌లో 24X7 గీతా మాధురి బాక్సింగ్‌ గ్లౌస్‌ వేసుకునే ఉండాలి. చివరిగా తన పిట్ట కథకు అర్థం చెబుతూ..ఎలిమినేట్‌ అవుతాడనుకున్నా గణేష్ ను తాబేలుతో పోల్చాడు. కిరీటిని దాటి గేమ్‌లో గణేష్ ముందుకు వెళ్లాడని చెప్పాడు. తాబేలులా గెలుస్తాడనుకున్న కిరీటి ఓడిపోయాడని ముగించాడు.