బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన శ్యామల ఏమందంటే..

బిగ్‌బాస్ సీజన్-2లో నాలుగోవారం యాంకర్ శ్యామల ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే. ఎంతో సైలెంట్‌గా, అందరితోనూ..స్నేహంగా ఉంటూ ఎటువంటి వివాదాల జోలికి పోకుండా ఇంటిలో అందరి మన్ననలను పొందుతున్న శ్యామల ఎలిమినేట్‌ కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ విషయం పై ఇప్పటికే పలు వార్తలు వినిపిస్తున్నాయి. కుట్ర ప్రకారం శ్యామలను ఎలిమినేట్‌ చేశారని నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన శ్యామల మాత్రం ఇంటర్వూలు ఇచ్చే పనిలో బిజీ అయిపోయింది.

యాంకర్ శ్యామల తాజాగా ఓ ప్రముఖ ఛానల్లో బిగ్‌బాస్ హౌస్ గురించి ముచ్చటించింది. శ్యామల మాట్లాడుతూ దీప్తిని గతంలో టీవీలో చూడటం తప్ప తనతో అంతకు ముందు పరిచయం లేదని, బిగ్‌బాస్ హౌస్‌లో తనకు మంచి ఫ్రెండ్ అయిందని చెప్పింది. దీప్తి ఆలోచనలు, తనవి చాలావరకు కామన్.. అందుకే మా ఇద్దరి మధ్య స్నేహం కుదిరిందేమో అని చెప్పింది. హౌస్‌లో గొడవలన్నీ కిచెన్‌లోనే అవుతాయని తనకు కూడా అక్కడే ఎవరితోనైనా గొడవ వచ్చేదని చెప్పింది. తేజశ్వి తను మొదట్లో ఉన్నట్టుగా ఇప్పుడు లేదని తాను మారిందని, తనను తాను చెక్ చేసుకుంటుందని చెప్పింది.

బిగ్‌బాస్ హోస్ట్‌ నాని దీప్తిని వదిన అని, శ్యామలను పిన్నిగారు అని పిలవడంపై శ్యామల మాట్లాడుతూ దీప్తి, తాను పక్క పక్కన ఇళ్లలో ఉండేవాళ్లు వరసలతో మాట్లాడుకునేట్టు మేము మాట్లాడుకుంటామని నాని అలా పిలిచేవారని చెప్పింది. బిగ్‌బాస్ నుంచి బయటకు వస్తూ బిగ్ బాంబ్ దీప్తిపైన వేసింది శ్యామల. దీనిపై స్పందిస్తూ హౌస్‌లో ఎండ సరిగా రావడం లేదని, బట్టలు సరిగా వాష్ చేయకపోతే స్కిన్ అలర్జీలు వస్తాయని అందుకే అందరి గురించి ఆలోచించి బిగ్‌బాంబ్(హౌస్‌లో ఉన్నవారందరి బట్టలు ఉతకడం) ను దీప్తిపైన వేసినట్లు చెప్పారు. ఇప్పటికే తేజు స్కిన్ అలర్జీతో బాధపడుతోందని, అది మరింత ఎక్కువ కాకూడదనే ఆ బాంబ్ దీప్తిపై వేసినట్లు చెప్పారు.

ఇక తనను హౌస్‌ నుంచి ఎలిమినేట్ చేయడంపై శ్యామల స్పందిస్తూ.. తాను ఉండటం వల్ల మిగతా వాళ్లకు టఫ్ అవుతుందనే ఆలోచనతోనే తనను పంపిస్తున్నారేమో అని అనిపించిందని శ్యామల తెలిపింది. తాను ఎవరినైనా నామినేట్ చేయాల్సి వస్తే నిజంగా తనకు మైనస్‌లు ఎవరిలోనూ కనపడకపోతే.. ఎవరైతే తనకు టఫ్‌గా అనిపిస్తారో వారినే ఎలిమినేట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి తాను వాళ్ల ప్లేస్‌లోకి వెళ్లి ఆలోచిస్తే.. తనకు అలా అనిపించింది అని చెప్పుకొచ్చింది.