బిగ్‌బాస్‌ హౌస్‌లో విజయ్ దేవరకొండ

బిగ్‌బాస్‌-2 హౌస్‌ మంచు లక్ష్మి ‘వైఫ్ ఆఫ్ రామ్’ , సాయి ధరమ్ తేజ్ తేజ్ ఐ లవ్ యు, శ్రీనివాసరెడ్డి జంబలకిడి పంబ సినిమాల ప్రమోషన్ కోసం వెలిన సంగతి తెలిసిందే.అంతేగాక ప్రదీప్‌ వెల్ట్‌ కార్డు ఎంట్రీ అంటూ.. హౌస్‌లోకి వచ్చి హంగమా చేశాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే ఈ ఎంట్రీ సినిమా ప్రమోషన్‌ కోసమా లేక ఇతర ప్రమోషన్ కోసమా అన్నది తేలాల్సి ఉంది.

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘గీత గోవిందం’ ఆగస్టు 15న విడుదల అవుతోంది. ఇప్పుడే ఈ సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి. దానికి తోడు ఈ హీరోకి యాత్‌లో విపరీతమైన క్రేజ్‌ ఉండటంతో ‘గీత గోవిందం’ సినిమా పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ అర్జున్‌ రెడ్డి బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎందుకు వెళ్లాడు తెలిస్తే సగం టెన్షన్ పోతుంది. అదికూడా షర్ట్ లేకుండా బిగ్ బాస్ హౌస్‌కి ఎంట్రీ ఇవ్వనున్నాడట ఈ అర్జున్‌ రెడ్డి.