బిగ్‌బాస్‌-2లో సాయి ధరమ్ తేజ్, అనుపమ

తెలుగు బిగ్‌బాస్‌ షోలో లవర్స్‌ స్పెషల్‌ టాస్క్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా ‘తేజ్‌’ ఐలవ్‌యూ మూవీ హీరో, హీరోయిన్‌.. సాయి ధరమ్ తేజ్‌, అనుపమ ఇద్దరు ఈ రోజు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అతిథులుగా వచ్చారు. కొద్దిసేపు ఇంటి సభ్యులతో ముచ్చటించారు. అనుపమ ఇంటి సభ్యులకు పాట పాడి వినిపించింది. సాయి ధరమ్‌ తేజ్‌.. మూవీ గురించి సభ్యులతో చర్చించాడు. హౌస్‌లో సాయి ధరమ్ తేజ్‌, అనుపమా, ఇంటి సభ్యులందరు తేజస్వీ తన 29వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఇంటిసభ్యులంతా ఆడిపాడారు. కొద్దిసేపు తర్వాత సాయి థరమ్‌, అనుపమలకు ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయం వచ్చిందంటూ బిగ్‌బాస్‌ సూచించడంతో బయటకు వచ్చేశారు. తర్వాత హౌస్‌లోని సభ్యులు బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌లో బిజీ అయిపోయారు.

తేజశ్వి తన పుట్టిన రోజు సందర్భంగా హౌస్‌లోని సభ్యులందరిపై తమ అభిప్రాయాన్ని వెల్లడించింది. హౌస్‌లోని అందరిలో కన్నా బాబు గోగినేని నా మోస్ట్ ఫేవరిట్‌. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఎవరైనా ఏదైనా చెబితే వినాలనిపించదు గానీ ఆయన చెబితే వినాలనిపిస్తుంది. బాబు గోగినేని నా తండ్రి అయి వుంటే నేను ఐఏఎస్ అధికారిని అయ్యేదాన్ని అని అన్నారు. ఆ తర్వాత అమిత్, తనీష్ నాతో ఫస్ట్ నుంచి చాలా క్లోజ్‌గా ఉండేవారు. నేను బాధపడితే నన్ను తట్టి ఓదార్చేవారు. తనీష్‌ నాకు చాలా ఇష్టం. హౌస్‌లోని సభ్యులందరికీ కూడా తనంటే ఇష్టం. నాకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి ఏమో నేను లవ్ చేయొచ్చేమో అన్నది. అప్పుడు తనీష్ వచ్చి తేజశ్విని హగ్ చేసుకున్నాడు. గీత ప్రతి విషయంలో కలగజేసుకోవడం నన్ను ఇరిటేట్ చేస్తుంది. హస్‌లో అందరిలో కన్నా ముందు శ్యామలతో కనెక్ట్‌ అయ్యా. ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి అంది.