బిగ్‌బాస్ హౌస్‌లోకి యువ హీరోయిన్

బిగ్‌బాస్-2 భారీ అంచనాల మధ్య మొదలైనా మొదటి సీజన్ అంత ఆసక్తికరంగా లేదని వార్తలు వినిపిస్తున్నాయి. సీజన్‌-2పై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. మొదటి సీజన్‌లో జూనియర్ ఎన్టీఆర్ హైలైట్. అయితే ఈ సీజన్‌కు నేచురల్ స్టార్ నానీ స్పెషల్ అట్రాక్షన్. ఈ సీజన్‌లో సభ్యుల ఎంపిక సరిగా లేదని కొందరు సెటైర్లు వేస్తున్నారు. జనాలను అంతగా ఆకట్టుకోలేక పోతున్నారని, ఏమైనా జరగొచ్చని హోస్ట్ నాని అంటున్నా అంత ఘాటైన మసాలా ఏదీ కనపించడం లేదని, హౌస్‌మేట్స్ మధ్య
జరుగుతున్న గేమ్ ప్రేక్షకులకు విసుకు తెప్పిస్తున్నట్లు అనుకుంటున్నారు.

అందుకోసమే బిగ్‌బాస్‌-2 ఆటను మరింత రసవత్తరం చేసేందుకు ఓ యువ హీరోయిన్‌ను వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో నందిని హౌస్‌లోకి ఎంటరైనా తగినంత మసాలా రావడం లేదని బిగ్‌బాస్ టీమ్ భావిస్తున్నట్లు సమాచారం. కుమారి-21 ఎఫ్ సినిమాలో హీరో రాజ్‌తరుణ్ సరసన నటించిన హెబ్బా పటేల్‌ను హౌస్‌లోకి పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఆమె అంగీకరించిందో లేదో తెలియాలంటే ఈ వారం చివరిలో క్లారిటీ వచ్చేఅవకాశముంది.