బిగ్‌ బి వియ్యంకుడు రాజన్‌ నంద మృతి

బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ ప్రస్తుతం బల్గేరియాలో ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తన వియ్యంకుడు, శ్వేతా బచ్చన్‌ నంద మామయ్య రాజన్‌ నంద మృతి చెందడంతో అమితాబ్‌ భారత్‌కు బయలుదేరారు. అనారోగ్యం కారణంగా చికిత్స తీసుకుంటూ.. రాజన్‌ నంద మృతి చెందారని గుర్‌గ్రామ్‌లోని ఓ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. రాజన్‌ నందా కొన్ని గంటల క్రితమే స్వర్గస్తులయ్యారని అమితాబ్‌ తన బ్లాగ్‌ పోస్టు ద్వారా వెల్లడించారు.

‘మా బంధువు రాజన్‌ నందన్‌, నికిల్‌ తండ్రి, శ్వేత మామగారు మృతిచెందారు. నేను భారత్‌కు బయలుదేరి వస్తున్నా’ అంటూ.. బిగ్‌ బి పేర్కొన్నారు. ఎస్కార్ట్స్‌ గ్రూప్‌కు రాజన్‌ నందా చైర్మన్‌గా ఉండగా.. నికిల్‌ నందా మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. రాజన్‌ నందా, రాజ్‌ కపూర్‌ పెద్ద కూతురు రీతు నందాను పెళ్లి చేసుకున్నారు. రాజన్‌ నందా, రీతు నందాలకు నికిల్‌, నటాషాలు పిల్లలు. రాజన్‌ నందా మృతి పట్ల పలువురు ప్రముఖలు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ ఘటనపై రిషి కపూర్‌ కుమార్తె రిద్ధిమా కపూర్‌ సాహ్ని తన సామాజిక మాధ్యమాల ఖాతాల ద్వారా స్పందిస్తూ.. ‘మీరు ఎక్కడున్నా ఓ లెజెండ్‌గానే మాకు గుర్తుండిపోతారు. ఎల్లవేళలా మాకు ప్రేమ పంచినందుకు కృతజ్ఞతలు. మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం. ఆర్‌ఐపీ రాజన్‌ అంకుల్‌’ అని పేర్కొంది.

CLICK HERE!! For the aha Latest Updates