బిగ్ బాస్ కోసం ఎన్టీఆర్ కు టైం లేదా..?

బిగ్ బాస్ సీజన్1 సక్సెస్ అయిందంటే దానిలో సగం క్రెడిట్ ఆ కార్యక్రమాన్ని హోస్ట్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు దక్కుతుంది. తన వాక్చాతుర్యంతో షోను రసవత్తరంగా నడిపించారు. ఇప్పుడు సీజన్2 ను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనికి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యహరిస్తాడా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. దానికి కారణం తారక్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్. త్రివిక్రమ్ తో ఓ సినిమా అలానే రాజమౌళితో మరో సినిమా కమిట్ అయ్యాడు ఎన్టీఆర్. త్రివిక్రమ్ సినిమా మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.
వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి జక్కన్నతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. అయితే రాజమౌళి తన సినిమా కోసం ముందుగానే వర్క్ షాప్ ను నిర్వహించబోతున్నాడు. తన బాడీ షేప్ లో కూడా కొన్ని మార్పులు చేయాల్సివుంటుంది. పైగా చరణ్ కాల్షీట్లు కూడా సెట్ కావాలి. వీటన్నింటి మధ్య తారక్ బిగ్ బాస్2 కార్యక్రమానికి అందుబాటులో ఉండే అవకాశాలు లేవంటున్నారు. మరి తారక్ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి!