బిగ్ బాస్: టీఆర్పీ రేటింగులు అదిరిపోయాయి!

ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ షోకి మిశ్రమ స్పందన లభించింది. అనుకున్నంత ఆసక్తిగా షోను రన్ చేయలేకపోతున్నారనే కామెంట్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు అలాంటి విమర్శలకు తెరపడే సంధర్భం వచ్చింది. ఇప్పటివరకు ఏ రియాలిటీ షోకు రానంత హయస్ట్ టీఆర్పీ రేటింగ్స్ బిగ్ బాస్ షోకి దక్కాయి. ఆదివారం నాటికి బిగ్ బాస్ షోకు 16.18 టీఆర్పీ వచ్చింది. గతంలో ఆట ఎపిసోడ్ కు 12 టీఆర్పీ వచ్చింది. ఆ తరువాత ఈ రేంజ్ లో ఏ ప్రోగ్రాంకు కూడా టీఆర్పీ లభించలేదు. ఈ ఒక్క షోతో స్టార్ మా ఆదివారం నాటికి నంబర్ వన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ గా నిలిచింది.
గతంలో నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి 12.34 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. తాజాగా రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఓ షోకు 9.1 టీఆర్పీ వచ్చింది. చిరంజీవి వ్యాఖ్యాతగా చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో 3.6 టీఆర్పీ సాధించింది. వీరందరితో పోల్చుకుంటే ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ షో నంబర్ వన్ స్థానంలో ఉంది. దీంతో ఈ షోపై కలిగిన అనుమానాలన్నీ కూడా తొలగిపోయాయి. ఇకపై షో మరింత ఆసక్తికరంగా ఉండేలా కొత్త కొత్త టాస్క్ లను డిజైన్
చేయబోతున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates