బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హాట్‌ భామ

బిగ్ బాస్ 2 షోకి మసాలా అందించడానికి హాట్ భామ పూజా రామచంద్రన్ ను వైల్డ్‌ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకొచ్చారు. నిన్న (సోమవారం) ఆమె హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పూజా రామచంద్రన్ తెలుగు, తమిళంలోని పలు చిత్రాల్లో నటించింది. నిఖిల్‌తో కలిసి ‘స్వామి రారా’ చిత్రంలో నటించింది. ఆ సినిమా తర్వాత పూజా పలు చిత్రాల్లో నటించినప్పటికీ అవి అంతగా ఆకట్టుకోలేదు. దాంతో ఇంకా బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉంది ఈ భామ.

ముందుగా హెబ్బా పటేల్‌ను బిగ్‌బాస్‌ హౌస్‌లోకి తీసుకోవాలని అనుకున్నారట. కానీ రెమ్యునరేషన్‌లో తేడా రావడంతో పూజ రామచంద్రన్‌ని తీసుకున్నారని టాక్. నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌-2 సక్సెస్‌గానే నడుస్తున్నప్పటీకీ ఎన్టీఆర్‌ స్థాయిలో ఆకట్టుకోవడం లేదని అంటున్నారు. ఇక పూజ ఎంటర్‌ అయ్యాక బిగ్‌బాస్‌లో ఎటువంటి మసాలా యాడ్‌ అవ్వనుందో చుడాలి మరి.

CLICK HERE!! For the aha Latest Updates