బోయపాటికి 15కోట్ల రెమ్యునరేషన్!

మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ దర్శకుడు బోయపాటి శ్రీను. స్టార్ హీరోలు సైతం ఆయన దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపుతుంటారు. తన సినిమాలలో హీరోలను అంతగా ఎలివేట్ చేస్తుంటాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు రామ్ చరణ్ తో ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్ లో రామ్ చరణ్ పాల్గొనున్నాడు. అయితే ఈ సినిమా కోసం బోయపాటికి ఏకంగా రూ.15కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

 

 

 

 

 

 

జీఎస్టీ ఇతర టాక్స్ లు అన్నీ కూడా బోయపాటినే చూసుకోవాలి. గతంలో బోయపాటి పదికోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్న దాఖలాలు ఉన్నాయి. కానీ పదిహేను కోట్లు అందుకోవడం అనేది ఇదే తొలిసారి. కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకులు ఈ రేంజ్ లో పారితోషికాలు అందుకుంటున్నారు. ఇప్పుడు బోయపాటి కూడా ఆ లిస్టులోకి చేరిపోతున్నాడు.