‘బ్రహ్మాస్ర్త’ టీమ్‌ను మిస్‌ అవుతున్నా: నాగ్‌

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు కింగ్‌ నాగార్జున నటించిన ‘మనం’ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ అతిథి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తాజగా నాగ్‌ కూడా అమితాబ్‌ నటిస్తోన్న ‘బ్రహ్మాస్ర్త’ సినిమాలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీలో అమితాబ్‌ ఓ కీలక పాత్ర పోషించగా రణ్‌బీర్‌కపూర్‌, అలియా భట్‌లు లీడ్‌ క్యారెక్టర్స్‌ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ బల్గేరియాలో జరుగుతోంది.

ఈ షెడ్యుల్‌లో నాగార్జున పాల్గొన్నారు. షెడ్యుల్‌ కంప్లీట్‌ అయ్యాక చిత్ర బృందంతో దిగిన ఫోటోలను సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. కాగా షూటింగ్‌లో తన పార్ట్‌ను కంప్లీట్ చేసుకున్న నాగ్‌…. మూవీయూనిట్‌ను మిస్‌ అవుతున్నట్లు ట్వీట్‌ చేశాడు. నాగ్‌ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించినందుకు చిత్ర నిర్మాత కరణ్‌ జోహార్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. దీనిపై నాగార్జున స్పందిస్తూ.. కరణ్‌కు ధన్యవాదాలు తెలిపాడు. ‘ఏ జవానీ హై దీవానీ’ ఫేమ్‌ అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.