బ్రహ్మీ ఇలా అయితే కష్టం!

బ్రహ్మీ ఇలా అయితే కష్టం!
ఒకప్పుడు సినిమాల్లో బ్రహ్మానందం కోసం ప్రత్యేకమైన ట్రాక్స్ రాసేవారు. సినిమాలో ఆయన ఉంటే 
కామెడీ పండినట్లే అని భావించేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. బ్రహ్మీ సినిమాలో ఉంటే 
ఆ సినిమా ఫ్లాప్ అనే యాంటీ సెంటిమెంట్ ఆయన్ను వెంటాడుతోంది. అంతేకాదు బ్రహ్మీ కామెడీ 
చాలా మందికి బోర్ కొట్టడంతో ఆయన స్థానంలోకి పృధ్వీ, సప్తగిరి, తాగుబోతు రమేశ్ వంటి వారు 
చేరారు. అసలు విషయంలోకి వస్తే.. బ్రహ్మీ సెట్స్ లో చాలా పొగరుగా ఉంటారట. యూనిట్ మీద 
తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారట. కమల్ హాసన్ హీరోగా రూపొందుతోన్న ‘శభాష్ నాయుడు’ 
సినిమాలో బ్రహ్మీ కూడా నటిస్తున్నాడు. అయితే సెట్ లో తనను సరిగ్గా చూసుకోవట్లేదని.. అక్కడ 
నుండి వెళ్లిపోవడం వంటి పనులు చేస్తున్నాడట. ఈ విషయం కమల్ వరకు వెళ్ళినా.. ఆయన కూడా 
ఏం చేయలేని పరిస్థితి. అవకాశాలు తగ్గిపోతున్న ఈ సమయంలో బ్రహ్మీ ఇలా చేయడం కరెక్ట్ కాదు. 
ఈ విషయాన్ని ఎప్పుడు అర్ధం చేసుకుంటాడో..?