‘బ్రాండ్‌ బాబు’ టైటిల్‌ పోస్టర్‌

యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌లతో యువ దర్శకుడు మారుతి మార్క్‌తో రిలీజ్ అవుతున్న మరో మూవీ ‘బ్రాండ్‌ బాబు’. యూత్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు తీస్తూ యువతకు కావాల్సిన అన్నిరకాల మెసేజీలు ఇస్తుంటాడు మారుతి. స్వయంగా తనే కథ అందిస్తూ సమర్పిస్తున్న ఈ సినిమాతో కన్నడ నటుడు సుమంత్‌ శైలేంద్ర తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌.

బుల్లితెర స్టార్‌ యాంకర్‌ ప్రభాకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటిస్తుంది. మురళీశర్మ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాకు జీవన్‌ బాబు (జేబీ) సంగీతమందిస్తున్నారు. మారుతి మార్క్‌కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై శైలేంద్ర బాబు నిర్మిస్తున్నారు. అతి త్వరలోనే చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నారు.