‘భారతీయుడు2’ లోనూ కమల్‌ ద్విపాత్రాభినయం..!

స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌, లోక నాయకుడు కమల్‌ హాసన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ‘భారతీయుడు2 ‘. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కినస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కమల్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో భారతీయుడు 2 పై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌ హల్‌చల్‌ చేస్తోంది. ఈ సీక్వెల్‌లోనూ కమల్‌ హాసన్‌ ద్విపాత్రాభినయం చేయనున్నాడట. తొలి భాగంలోనూ కమల్‌ డ్యూయల్‌ రోల్‌లో నటించాడు. అయితే ఆ చిత్రం క్లైమాక్స్‌లో ఒక కమల్‌ హాసన్‌ చనిపోతాడు. మరి సీక్వెల్‌లో ఇద్దరిని ఎలా చూపిస్తారో చూడాలి.ఇప్పటికే ‘సేనాపతి ఈజ్‌ బ్యాక్‌’ అంటూ ఓ ప్రీలుక్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. కమల్‌ సరసన నయనతార హీరోయిన్‌గా నటించే అవకాశం ఉంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.