‘మణికర్ణిక’ దర్శకుడు ఎవరు..!?

ప్రముఖ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితాధారంగా ‘మణికర్ణిక’ ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ చారిత్రక చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మణికర్ణిక పాత్రలో కంగన నటిస్తున్నారు. అయితే, క్రిష్‌కు, కంగనకు మధ్య మనస్పర్ధలు వచ్చాయని కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై గతంలో కంగన క్లారిటీ ఇచ్చారు. తనకు క్రిష్‌తో ఎలాంటి విభేదాలూ లేవని, తామిద్దరం రోజూ స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూనే ఉంటామని తెలిపారు.

తాజాగా షూటింగ్‌ లోని క్లాప్‌బోర్డ్‌ ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఎందుకంటే ఆ క్లాప్‌బోర్డ్‌లో ‘డైరెక్టర్’ స్థానంలో క్రిష్‌ పేరు కాకుండా కంగన పేరుంది. కిశోర్‌ అనే నెటిజన్‌ ఆ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘అయ్యో అదేంటి? క్రిష్‌ స్థానంలో కంగన పేరుందేంటి?’ అని ప్రశ్నించాడు. దాంతో కొంతకాలంగా వస్తున్న వార్తలకు మరింత బలం చేకురింది. దీనిపై కంగన టీం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మరోసారి క్లారిటీ ఇచ్చింది.

‘మణికర్ణిక’ సినిమాకు దర్శకుడు ఎప్పటికీ క్రిషే. ఆయనే ప్రస్తుతం మరో సినిమాతో బిజీగా ఉండడంతో మణికర్ణిక సినిమాలో కొన్ని ప్యాచ్‌ వర్క్స్‌ మిగిలిపోయాయి. అనుకున్న తేదీన(2019 జనవరి 25)సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు గానూ కంగన దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. సెట్లో ఎలాంటి కన్‌ఫ్యూజన్‌ లేకుండా ఉండేందుకు క్లాప్‌ బోర్డ్‌పై దర్శకుడి పేరును క్రిష్‌కు బదులు కంగన అని రాశాం అని వెల్లడించారు.