మదాలస శర్మకు పెళ్లంట

అల్లరి నరేష్‌ ‘ఫిట్టింగ్‌ మాస్టర్‌’ సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించి.. ఆలస్యం అమృతం, మేం వయసుకు వచ్చాం, చిత్రం చెప్పిన కథ, రామ్‌లాలా తదితర చిత్రాల్లో నటించిన ముంబై బ్యూటీ మదాలస శర్మ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. తాజా సమాచారం ప్రకారం మదాలస ఒకప్పటి బాలీవుడ్‌ స్టార్‌ హీరో మిథున్‌ చక్రవర్తి కుమారుడు మిమొ చక్రవర్తిని పెళ్లాడబోతుందట. జులై 7న పెళ్లి ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది. విదేశాల్లో వీరి వివాహం జరుగుతుందని టాక్‌.

కొన్ని రోజులుగా మదాలస శర్మ, విమొ చక్రవర్తి ప్రేమించుకుంటున్నారు. ఎట్టకేలకు వీరి వివాహానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. అయితే వెడ్డింగ్‌ వెన్యూ ఎక్కడ అనే దానిపై త్వరలో క్లారిటీ రానుంది. బాలీవుడ్‌ నిర్మాత, దర్శకుడు శుభాష్‌ శర్మ, నటి శీలా శర్మ కుమార్తె అయిన మదాలస శర్మ17 ఏళ్ల వయసులోనే కెరీర్‌ ప్రారంభించింది. అనుకున్న స్థాయిలో ఆమె కెరీర్‌ సాగలేదనే చెప్పాలి. తెలుగులో చిత్రం చెప్పిన కథ తర్వాత ఆమె సినిమాలు రాలేదు. తెలుగు, కన్నడ, తమిళం, పంజాబి భాషల్లో ప్రయత్నించినా పెద్దగా వర్కౌట్‌ కాలేదు.