మరోసారి తండ్రి కోడుకులుగా..మహేష్‌, ప్రకాష్‌ రాజ్‌

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు తన సిల్వర్‌ జూబ్లీ (25)వ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రానుంది. ఈ సినిమాను దిల్‌రాజు, అశ్వనీదత్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ డెహ్రాడూన్‌లో జరుగుతోంది. తొలిసారిగా మహేష్ ఈ సినిమా కోసం కొత్తలుక్‌తో కనిపించబోతున్నాడు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్‌ ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు మహేష్ 25వ సినిమాలోనూ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడట. మహేష్ బాబు సినిమా అంటే ఆ సినిమాలో కచ్చితంగా ప్రకాష్ రాజ్‌ ఉండాల్సిందే. ఒకటి రెండు సినిమాలు తప్ప మహేష్‌ హీరోగా నటించిన అన్ని సినిమాల్లో ప్రకాష్ రాజ్ నటించాడు.

రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్‌, మహేష్ బాబు తండ్రిపాత్రలో నటిస్తున్నాడు. గతంలో దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వీరిద్దరు తండ్రి కొడుకులుగా నటించారు. అందుకే సెంటిమెంట్‌ పరంగానూ ఈ కాంబినేషన్‌ ప్లస్‌ అవుతుందని భావిస్తున్నారు. ఎక్కువ భాగం ఫారిన్‌లో షూటింగ్‌ జరుపుకోనున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే మహేష్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.