మరో మల్టీస్టారర్ లో నాగ్!

కథ బాగుంటే చాలు ఏ హీరోతో అయినా సినిమా చేయడానికి రెడీ అంటూ గతంలో స్టేట్మెంట్ ఇచ్చాడు నాగ్. ఈ క్రమంలో యంగ్ హీరో నానితో కలిసి తో ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఏప్రిల్ నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. అయితే ఈ మల్టీస్టారర్ తో పాటు తాజాగా మరో మల్టీస్టారర్ సినిమాలో నటించడానికి అంగీకరించాడట నాగ్. ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం చేయబోయే సినిమాలో నాగార్జునను కూడా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

తేనాండాల్ ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గతంలో నాగార్జున ‘ఊపిరి’ సినిమాలో తమిళ హీరో కార్తితో కలిసి నటించారు. ఇప్పుడు మరో తమిళ హీరో ధనుష్ తో కలిసి నటిస్తుండడం విశేషం. ప్రస్తుతం నాగార్జున దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. దీనికి ‘శపథం’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.