మరో వివాదంలో కత్తి మహేష్

సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ ఆ మధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వరుస విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండేవాడ. ఆ విషయం సద్దుమణిగాక నిత్యం ఏదో వివాదంపై వార్తల్లో నిలుస్తున్నాడు. బిగ్‌బాస్ తర్వాత తెలియని వారికి కూడా కత్తి మహేష్ గురించి చాలా మందికి తెలిసిందేమో. ఎప్పుడూ ఏదో వివాదంలో ఉండే కత్తి మహేష్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. కత్తి మహేష్‌పై హిందూ జనశక్తి నేతలు కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారట. ఆయన ఓ టీవీ చర్చా కార్యక్రమంలో శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను కించపరిచారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారట.

ఓ ఛానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో భాగంగా కత్తి మహేశ్‌ ఫోన్‌ఇన్‌లో మాట్లాడుతూ రామాయణంపైనా.. రాముడిపైనా కత్తి మేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. విన్న ప్రతి హిందువు మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరినట్లు తెలిసింది.