మరో వైవిధ్యమైన పాత్రలో మెగాహీరో!

మరో వైవిధ్యమైన పాత్రలో మెగాహీరో!
నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ‘ముకుంద’ చిత్రంతో సినిమా రంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత 
‘కంచె’,’లోఫర్’ ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా భిన్నమైన పాత్రల్లో నటిస్తూ.. తన 
ప్రత్యేకతను చాటుతున్నాడు. ప్రస్తుతం ఈ మెగాహీరో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘ఫిదా’, శ్రీనువైట్ల 
దర్శకత్వంలో ‘మిస్టర్’ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు కాకుండా వరుణ్ మరో సినిమాకు గ్రీన్ 
సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు చందు మొండేటి వివరించిన త్రిల్లర్ కాన్సెప్ట్ వరుణ్ ను 
ఎగ్జైట్ చేసిందట. అందుకే వెంటనే ఒప్పేసుకున్నట్లు సమాచారం. గతంలో వచ్చిన ‘గజిని’,’అపరిచితుడు’
చిత్రాల తరహాలో ఈ సినిమా కూడా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. చందు మొండేటి ప్రస్తుతం 
‘ప్రేమమ్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. సెప్టెంబర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ వెంటనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని చందు భావిస్తున్నాడు. 
CLICK HERE!! For the aha Latest Updates